దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాల్లో ముగిసింది. ఉదయం 82,151.07 వద్ద ప్రారంభమైన సూచీ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 81,997.29 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్ చివరకు 466.26 పాయింట్లు క్షీణించి చివరకు 82,159.97 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 64.90 పాయింట్లు తగ్గి 25,262.15కి దిగొచ్చింది. రూపాయి మారకం విలువ డాలరుతో పొలిస్తే 15 పైసలు తగ్గి రూ.88.31 వద్ద ఉంది.