RR: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని అంగన్వాడీ ఉపాధ్యాయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వినతి పత్రం అందించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని ముందస్తు అరెస్టులు చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రీ స్కూల్ లు అంగన్వాడీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను పక్కన పెట్టి కొత్త పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదన్నారు.