MBNR: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఎస్పీ డి.జానకి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం, విజయం నిండాలని ఆకాంక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.