AKP: నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం మృగవేట కార్యక్రమాన్ని ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించారు.స్వామివారి ఉత్సవమూర్తులను పీఠంపై అధిష్టింపచేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం,ధనుర్భాణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీరాజనం మంత్ర పుష్పం తీర్థ గోష్టి జరిపించారు.