W.G: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వలన వ్యవసాయ రంగంలో రైతులకు లాభం చేకూరుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ తెలిపారు. బుధవారం సాయంత్రం సమ్మెటవారిగూడెంలో వ్యవసాయ శాఖ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుతో ట్రాక్టర్‌పై రూ. 50 వేల వరకు, అలాగే వ్యవసాయ యంత్ర పరికరాలపై కూడా ధర తగ్గుతుందని వివరించారు.