MDK: మాసాయిపేట మండలం హకీంపేట శివారులోని జమున పౌల్ట్రీ పరిశ్రమలను అధికారుల బృందం బుధవారం తనిఖీ చేపట్టింది. మాసాయిపేట తహసీల్దార్ జ్ఞాన జ్యోతి, వెల్దుర్తి ఎస్సై రాజు, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పౌల్ట్రీలో యూరియా వాడకం ఉండవచ్చన్న అనుమానంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఎలాంటి యూరియా వాడకం లేదని నిర్ధారించారు. ఇందులో అధికారులతో ఆర్ఐ దన్ సింగ్ పాల్గొన్నారు.