SRPT: అనంతగిరి మండలం తెల్లబండ తండాలో కుక్కల దాడిలో మల్సూర్ అనే రైతుకు చెందిన గొర్రె మృతి చెందింది. ఆదివారం రాత్రి ఈ దాడి జరిగిందని, దీంతో సుమారు పదివేల రూపాయల వరకు నష్టపోవాల్సి వచ్చిందని మల్సూర్ తెలిపారు. గొర్రెల సాగుతో జీవనం సాగిస్తున్న తమకు, కుక్కల దాడితో నష్టం వాటిల్లినందున ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.