SRPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా బోరబండలో డివిజన్ లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.