BHPL: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ప్రాబల్యం చాటనున్నారు. ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. 50 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ కావడంతో రాజకీయ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాలో 3,02,147 ఓటర్లలో 1,54,744 మంది మహిళలు, 1,47,388 మంది పురుషులు ఉన్నారు.