MDK: శివంపేట్ మండలంలోని చండిలో రూ.2.50 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. ఫలితంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.