NLG: జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్ అండర్-17, అండర్-14 బాలుర సెలక్షన్స్, DEO బొల్లారం బిక్షపతి ఆదేశానుసారం SGF సెక్రటరీ దగ్గుబాటి విమల నల్గొండలోని మేకల అభినవ్ ఔట్ డోర్ స్టేడియంలో ఆదివారం సెలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎంపికలో 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ మేరకు విమల మాట్లాడుతూ.. అథ్లెటిక్స్‌లో జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. అనంతరం అథ్లెట్లనీ అభినందించారు.