SRD: కల్హేర్ మండలం మీర్ఖాన్ పేటలో శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు గురువారం నిర్వాహకులు తెలిపారు. దుర్గమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు జరుగుతాయన్నారు. ఫైనల్ కుస్తీకి రూ.11 వేలు నగదు బహుమతి ఉంటుందన్నారు. ఇందులో మహిళల కుస్తీ పోటీలు కూడా ఉంటాయని, MPలోని ఇండోర్, భోపాల్ నుండి పైల్వాన్లు వస్తున్నట్లు చెప్పారు.