GDL: గద్వాల కోటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 29న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ హృదయ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. HCL టెక్నాలజీ ఆధ్వర్యంలో మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో MPC, BiPC, CEC, HEC ఒకేషనల్ కోర్సు ద్వారా 75% మార్కులు సాధించినవారు అర్హులన్నారు.