ADB: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బజార్హత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు 108 వైద్య సిబ్బంది సహాయంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.