SDPT: జగదేవ్పూర్ మండలం వ్యాప్తంగా గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచే దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇండ్లు, చెట్లు, వాహనాల పై మంచు తుంపర్లు కురిశాయి. పొగమంచు ధాటికి రోడ్ల పై ఏమి కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించారు. అలాగే ఇటీవల వరుసగా విద్యా సంస్థలకు కార్యాలయాలకు సెలవు రావడంతో చాలా మంది ప్రయాణం చేపట్టారు.