KMM: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయాన ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ విమర్శించారు. కామేపల్లి మండలం కెప్టెన్ బంజారాలో ఆమె మాట్లాడుతూ.. అమలు కానీ హామీలు ఇచ్చి, బీసీ రిజర్వేషన్ అంటూ నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.