JGL: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కమలాపూర్ రోడ్ ధర్మపురి బ్రాంచ్ మేనేజర్‌గా కిరణ్ శనివారం భాద్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మెనేజర్‌ను బ్యాంకు సిబ్బంది శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన సేవలను, అర్హులైన రైతులకు ఋణాలు అందేలా చూస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి రాజేంద్రప్రసాద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.