NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు అందించేందుకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని యువజన కాంగ్రెస్ నాయకుడు ధానావత్ కిషన్ నాయక్ అన్నారు. దామరచర్ల మండలం తిమ్మాపురంలో రూపావత్ సునీత ఇందిరమ్మ ఇంటికి శనివారం గ్రామ నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఇతర నేతలు పాల్గొన్నారు.