MBNR: జడ్చర్లలోని కావేరమ్మపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి ధనుష్ గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉస్మానియా ఆస్పత్రిలోని విద్యార్థి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే సందర్శించి నివాళులర్పించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని మృతిచెందిన విద్యార్థి తల్లి, తండ్రికి ఎమ్మెల్యే భరోసా కల్పించి ఓదార్చారు.