కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుంచి స్వీకరించి ఆయా శాఖల అధికారులకు పంపాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.