సిద్దిపేట: జగదేవపూర్ మండల సర్పంచ్ల ఫోరం నూతన అధ్యక్షుడిగా జగదేవపూర్ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి వంటేరు ప్రతాపరెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు శ్రీనివాస్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.