ADB: బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుకు శాలువతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు జొన్నలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.