tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు.
tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బండి సంజయ్‌ను (bandi sanjay) కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు. దీంతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
2024 పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చే ఉద్దేశం తమకు లేదని తరుణ్ చుగ్ (tarun chugh) స్పష్టంచేశారు. బూత్ స్వశక్తీరణ్ అభియాన్ వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. పలు అంశాలపై తరుణ్ చుగ్ (tarun chugh) మాట్లాడారు. బండి సంజయ్ (bandi sanjay) పదవీకాలం గురించి క్లారిటీ ఇచ్చారు. సంజయ్‌ను (sanjay) మార్చబోమని స్పష్టంచేశారు. అంతకుముందు మాత్రం ఈటల రాజేందర్‌కు (etela rajender) బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ కట్టబెడతారని ఊహాగానాలు వినిపించాయి. పలు సమీకరణాలతో వార్తలు చక్కర్లు కొట్టాయి. చుగ్ తేల్చిచెప్పడంతో వాటికి బ్రేకు పడినట్టు అయ్యింది.
బీజేపీలో ఈటల రాజేందర్ (etela rajender) అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆయనకు పదవీ ఆఫర్ చేస్తారని అంచనాలు నెలకొన్నాయి. ఓ వార్తా సంస్థ అయితే ఏకంగా ఈటల రాజేందర్ (etela rajender) తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని కథనం ప్రచురించింది. దీనిపై దుమారం చెలరేగింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ (cm kcr) కూడా మిత్రుడు ఈటల రాజేందర్ అంటూ చాలా సార్లు ప్రస్తావించారు. ఆ సమయంలో ఘర్ వాపసీ (ghar vapasi) అనే నినాదాలు చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ (etela rajender) మాట్లాడుతూ.. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అవీ ఊహాగానాలేనని.. నిజం కాదని స్పష్టంచేశారు.