NLG: వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘స్టే డాగ్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పెంపుడు, వీధి కుక్కల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, వీధుల్లో చిన్న పిల్లలను ఒంటరిగా పంపించకూడదని సూచించారు.