MNCL: ఎస్సీ సంక్షేమ సంఘం మహిళా విభాగం సర్వసభ్య సమావేశం మంగళవారం శ్రీరాంపూర్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంఘం మహిళా విభాగం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా కన్నూరి మహేశ్వరి, శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షురాలిగా నీలమ్మ, ప్రధాన కార్యదర్శిగా రౌతు లక్ష్మిని నియమించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింజుపల్లి నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.