ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడకు చెందిన బొల్లికొండ వెంకటేశ్వర్లు (52) అనే రైతు తన పొలంలో ట్రాక్టర్ నడుపుతూ గుండెపోటుతో నిన్న మృతి చెందాడు. నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవించే ఆయన, పొలం దున్నుతూ నీళ్లు తాగి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.