NDL: విశేష పుష్పాలంకరణలో బనగానపల్లె (M) నందవరం శ్రీ చౌడేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చారు. పుష్య మాసం ఆదివారం అష్టమిని పురస్కరించుకుని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూజలు చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి పుష్పాలంకరణ చేసి రుద్రాభిషేకం, కుంకుమార్చన, అభిషేకం, మహామంగళహారతితో నైవేద్యం సమర్పించారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది.