BDK: గోదావరి నది తీరం వద్ద ఘనంగా ఏరు ఉత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి నది తీరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నదీ తీరమంతా పండుగ వాతావరణంతో కళకళలాడగా ఆదివారం సెలవు దినం కావడంతో గోదావరి కరగట్ట ప్రాంతం జనసంద్రంతో నిండిపోయింది.