BDK: బతుకమ్మ పండుగ సందర్భంగా పూల కోసం చెరువులో నీటి గుంతలలోకి దిగవద్దని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు అశ్వాపురం ఎస్ హెచ్ ఓ అశోక్ రెడ్డి ఆదివారం సూచించారు. గత సంవత్సరం పూల కోసం చెరువులోకి దిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయని కావున అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని అదేవిధంగా పిల్లలను పూల కోసం చెరువుల వైపు పంపవద్దని తెలిపారు.