VSP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లిలో గ్రామ జ్యోతి యువజన సంఘానికి చెందిన యువకులు ఆదివారం శ్రమదానంతో నూకాంబిక చెరువు ప్రాంగణంలో తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. ప్రతి ఆదివారం గ్రామంలో శ్రమదానం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు.