W.G: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు చెందిన ఆరుగురు సభ్యుల ‘రాబరీ గ్యాంగ్’ రాష్ట్రంలో సంచరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు 100, 112, నంబర్లకు సమాచారం అందించాలని ఆమె ప్రజలను కోరారు.