Daughter's question on Muthireddy, father of wrong doings
MLA Muthireddy Daughter:జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని (Muthireddy) ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డి (bhavani reddy) నిలదీశారు. తప్పుడు పనులేంటీ నాన్నా అని మండిపడ్డారు. జనగామకు రాజువని చెబుతావు.. తన సంతకాన్ని ఫోర్జరీ ఎందుకు చేశావ్ అని అడిగారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా జనగామ శివారు వడ్లకొండలో హరితోత్సవంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy) పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వెళుతుండగా.. కూతురు తుల్జా భవానీ రెడ్డి, అల్లుడు అక్కడికి వచ్చారు.
1200 గజాల భూమి..
యాదగిరి రెడ్డి (yadagiri reddy) వద్దకు కూతురు భవానీరెడ్డి వచ్చారు. చేర్యాలలో 1200 గజాల భూమిని తన పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేశావని అడిగారు. అక్కడ తాను ఎలాంటి భూమి కొనలేదని చెప్పారు. రిజిస్ట్రేషన్ రోజు ఒక పేపర్ మీద సంతకం చేశానని వివరించారు. కార్యాలయం వద్ద బెదిరించి సంతకం పెట్టించుకున్నారని ఆరోపించారు. ఆ సంతకం ఇష్టపూర్వకంగా పెట్టలేదని.. అలాగే ఇతర సంతకాలు ఫోర్జరీ చేశారని చేర్యాల పోలీసు స్టేషన్లో యాదగిరి రెడ్డిపై కేసు నమోదు చేస్తానని భవానీ రెడ్డి తెలిపారు.
కోర్టుల చుట్టూ తిరగాలా..?
తన తండ్రి చేస్తున్న తప్పులకు తాను కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని భవానీ రెడ్డి అంటున్నారు. కూతురు మాట్లాడుతుండగానే.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (yadagiri reddy) స్పందిస్తూ.. ఫోర్జరీ సంతకం అంటున్నావ్ కదా.. అదీ ప్రభుత్వం చూసుకుంటుంది, ఇప్పటికే ఓ కేసు పెట్టావు కదా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రత్యర్థులు కూతురిని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.
అప్పుడు కలెక్టర్.. ఇప్పుడు కూతురు
జనగామలో గతంలో కలెక్టర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. తనపై సీఎం కేసీఆర్కు నమ్మకం ఉందని వివరించారు. మే 9వ తేదీన హైదరాబాద్లో ఓ హొటల్ లీజు ఒప్పందంపై తన సంతకం ఫోర్జరీ చేశారని ముత్తిరెడ్డిపై (Muthireddy) భవానీరెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ముత్తిరెడ్డి (Muthireddy) ప్రస్తావించారు. ఇప్పుడు మరో కేసు పెడతానని భవానీ రెడ్డి అంటున్నారు.