KMM: బీటెక్ చదివినా ఉద్యోగం రాకపోవడంతో లగ్జరీ లైఫ్ కోసం మల్లికార్జున్ రెడ్డి దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బుతో బెట్టింగ్లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడని సీఐ చరమందరాజు తెలిపారు. కాగా, నిన్న నిర్వహించిన వాహన తనిఖీలో నేరస్థుడి వద్ద నుంచి 51.78 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 2,85,000 నగదు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.