KMR: ఎల్లారెడ్డిలో మంగళవారం రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరుతుంది. రహదారులు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ వర్షంతో ఎల్లారెడ్డిలో అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలంలో సైతం వర్షం కురుస్తోంది.