HYD: నగరంలో నిన్న రాత్రి వర్షం దంచికొట్టింది. పాత GHMC పరిధి అల్వాల్ అంబేద్కర్ నగర్లో అత్యధికంగా 14.0 మి.మీ వర్షం కురిసింది. కాప్రా, కుషాయిగూడలో 13.8 మి.మీ, వెస్ట్ మారేడ్‌పల్లిలో 13.0 మి.మీ వర్షం పడింది. నేరెడ్మెట్, ఆనంద్ బాగ్, మౌలాలి, సఫిల్‌గూడ ప్రాంతాల్లో 12 మి.మీకి పైగా వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. వేసవి వేళ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.