VKB: పూడూరు మండలంలోని రాకంచెర్ల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఇవాళ కొబ్బరికాయ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు ఓ ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం 8:30గంటలకు ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొని ఫిక్స్ డిపాజిట్ రూ. 2,000 చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.