KNR: శాతవాహన వర్సిటీలో 14 ఏళ్ల తర్వాత తెలుగు పీహెచ్ఎకి అనుమతి లభించింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ను జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య, తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు గజమాలతో ఘనంగా సత్కరించారు. నెట్, సెట్ సాధించిన విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని చైతన్య పేర్కొనగా, వర్సిటీ అభివృద్ధే తన లక్ష్యమని వీసీ తెలిపారు.