HYD: పాతబస్తీలోని ఫలక్‌నూమ ROBని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. రూ.52.03 కోట్లతో 360 మీటర్ల పొడవున GHMC SCR సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. ఈ బ్రిడ్జి బార్కస్ నుంచి చార్మినార్ రూట్‌తో పాటు ఫలక్‌నూమ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.