NLG: సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం తల్లి నెల్లికంటి పార్వతమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. శుక్రవారం మునుగోడులో ఆమె చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురిగి చలపతి, పందుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.