కడప: మైదుకూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజోలి రిజర్వాయర్ను పూర్తిచేయటానికి అవసరమైన నిధులను విడుదల చేసి నిర్దిష్ట సమయంలో పూర్తిచేస్తామని ప్రకటన చేయాలని సీపీయo జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు జి.శివకుమార్ విజ్ఞప్తి చేశారు. రాజోలి రిజర్వాయర్ పూర్తి చేయటం వల్ల కేసీ కెనాల్ పరివాహిక ప్రాంతంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.