VSP: పద్మనాభ మండలం మద్దిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన జిత్తిక అప్పన్న (35) రోడ్డుపై నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పన్న అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.