ప్రకాశం: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 4,547 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు.