RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కృషివల్లే నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. చేవెళ్ల మున్సిపల్, మండల పరిధిలోని సీసీ రోడ్లు, వీధిదీపాల కోసం హెచ్ఎండీఏ ద్వారా రూ.9.90 కోట్లు మంజూరయ్యయన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.