MHBD: జిల్లాలో, యూరియా లోడ్‌తో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో, కానిస్టేబుల్ అలీమ్ స్వయంగా లారీ నడిపి,కల్వలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సకాలంలో యూరియాను చేర్చాడు. రైతులు, అధికారులు కానిస్టేబుల్ సేవలను అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, కానిస్టేబుల్ అలీమ్‌ను అభినందించి, శాలువా కప్పి సత్కరించారు.