NRPT: మద్దూర్ మండల తెలంగాణ జాగృతి అధ్యక్షుడిగా అప్పిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్‌ను నియమించారు. ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతో ఆయన సేవాభావాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆయనను సన్మానించి నియామక పత్రాన్ని అందజేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.