D Srinivas: మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన డీ శ్రీనివాస్
సీనియర్ నేత, టీఆర్ఎస్ మాజీ రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్(D Srinivas) మళ్లీ కాంగ్రెస్ పార్టీ(congress party)లో చేరారు. దీంతోపాటు అతని కుమారుడు కుమారుడు డి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ చేరుకుని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో పార్టీ కుండువా స్వీకరించారు.
సీనియర్ నేత డి.శ్రీనివాస్(D Srinivas) ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్లో చేరడం లేదని ఇవాళ ఉదయం లేఖ విడుదల చేసినట్లు తెలిసింది. కానీ తర్వాత కాసేపటికే ట్విస్ట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు డీఎస్ వెల్లడించారు. వీల్ చైర్లో గాంధీభవన్ కు వచ్చిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే.. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీఎస్ తో పాటు ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంజయ్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే లేఖ ఎవరు రిలీజ్ చేశారనేది తెలియాల్సి ఉంది.
అంతకుముందు మాట్లాడిన డీఎస్ .. కాంగ్రెస్ పార్టీ(congress party)లో చేరుతున్నాను కాబట్టే గాంధీ భవన్(gandhi bhavan) కు వచ్చినట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీ మనిషినని, తనను ఎవరూ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లోక్సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై డీఎస్ స్పందించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే వారికి అసలు అర్హత ఉందా..? అంటూ ప్రశ్నించారు. తాను పీసీసీగా ఉన్నప్పటి సమయానికి.. ఇప్పటికీ రాహుల్ కు చాలా తేడా ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఊహించిన దానికంటే గొప్పగా పనిచేస్తున్నారంటూ డీఎస్ కితాబిచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఆయన ఇంకో కుమారుడు డి అరవింద్ నిజామాబాద్ నుంచి బిజెపి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
గాంధీభవన్ కు చేరుకున్న డీఎస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(mp arvind) ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని డీఎస్(DS)ను వీహెచ్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం రాహుల్ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపడుతున్న సత్యాగ్రహ దీక్షలో డీఎస్ పొల్గొన్నారు. ఈ సత్యాగ్రహ దీక్షలో జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా తదితరులు పాల్గొన్నారు.