బీజేపీ కీలక నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala Rajender) ఇంటికి సీఆర్పీఎఫ్ జవాన్లు చేరుకున్నారు.అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (MLC Padi Kaushik Reddy) నుంచి ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు తన ఇల్లు, కార్యాలయం పరిసరాల్లో తిరుగుతున్నారంటూ ఈటల ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఈటలకు 2 ప్లస్ 2 భద్రత ఉండేది. వై ప్లస్ భద్రత (Y Plus security) నేపథ్యంలో ఇకపై మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు.ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు చొప్పున పర్సనల్ సెక్యూరిటీ Personal securityఆఫీసర్స్‌లు రోజుకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు.
మరో ఐదుగురు గార్డులు ఈటల ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతా విధుల్లో ఉంటారు.మరోవైపు ఈటలకు తగిన భద్రత కల్పిస్తామని తెలంగాణ సర్కార్ (Telangana Govt) కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వయంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ నివాసాన్ని గత మాసంలో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పరిశీలించారు. ఈటల తో భద్రత విషయమై చర్చించారు. సుఫారీ ఆరోపణలపై కూడ డీసీపీ సందీప్ రావు ఆయనతో చర్చించారు.ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని నిర్ధారణ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు వైప్లస్ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.