»Criticism Is Easy Self Examination Is Important Vijayashanti
Ramulamma విమర్శలు తేలిక.. ఆత్మ పరిశీలిన ముఖ్యం
తాము ఎందుకు పార్టీ మారామో వివరించారు రాములమ్మ విజయశాంతి. ఆ నాడు బీఆర్ఎస్ పార్టీపై చర్యలు ఉంటాయని చెబితేనే పార్టీలో చేరామని.. ఎలాంటి యాక్షన్ తీసుకోక పోవడంతో తిరిగి సొంతగూటికి చేరామని వివరించారు.
Ramulamma: ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై రాములమ్మ విజయశాంతి ( Vijayashanti) స్పందించారు. పార్టీ మారారు.. అని విమర్శించే వారికి తగిన సమాధానం సోషల్ మీడియా ఎక్స్‌లో ఇచ్చారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏడేళ్లు పార్టీ జెండా మోసి, కొట్లాడింది తాను అన్నారు. ఆ రోజు బండి సంజయ్, కిషన్ రెడ్డి మరికొందరు తన వద్దకు వచ్చి బీఆర్ఎస్ పార్టీపై చర్యలు ఉంటాయని చెప్పారు. అందరూ సపోర్ట్ చేస్తే బీజేపీ కొట్లాడుతుందని చెప్పారు. తమ ముగ్గురిని ఒప్పించారని తెలిపారు.
ఇదే అంశంపై బీజేపీకి చెందిన ఢిల్లీ పెద్దలతో హామీ ఇప్పించి, చేర్చుకుంది నిజం కాదా అని అడిగారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోవాలి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అనే ఒక కారణంతో.. ఏళ్లుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లామని గుర్తుచేశారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వివరించారు. మోసం చేసి.. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ అవగాహన పెట్టుకుందని పేర్కొన్నారు.
ఈ విషయం తెలిసి.. నేతలు రాజీనామా చేసి, బయటకు వచ్చారని విజయశాంతి ( Vijayashanti) తెలిపారు. తమపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు ఏం జరిగిందనే అంశంపై ఆత్మ పరిశీలన అవసరం అని చెప్పారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ దూసుకుపోతుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని రోజుల సమయం మాత్రం ఉండటంతో ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో టీ- కాంగ్రెస్ ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలను నియమించింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నియమించారు.