Revanth Reddy: పాలమూరు పోలీసులపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గుడ్డలూడదీసి కొడతామన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కాగా.. ఆ పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు. రేవంత్ (Revanth) వ్యాఖ్యలపై పోలీసులు అయినా అతని గన్ మెన్లు మనస్పర్థకు గురయ్యారు. బుధవారం నుంచి విధులకు రావడం లేదని తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి (Revanth) మరోసారి స్పందించారు. గన్ మెన్లు విధులకు రాకున్నా ఫర్లేదు అని.. తనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని వివరించారు. లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తన సైన్యం అని.. వారే తనకు సెక్యూరిటీ ఇస్తారని వివరించారు.
పనిలో పనిగా సీఎం కేసీఆర్పై (cm kcr) విమర్శలు చేశారు. కోర్టు చెప్పినా.. కేసీఆర్ సర్కార్ వినడం లేదన్నారు. ఎంపీ, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకే సెక్యూరిటీ తొలగించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సెక్యూరిటీ ఇచ్చామని గుర్తుచేశారు. తాను ప్రజల మనిషిని అని.. తనకు సెక్యూరిటీతో పనిలేదని చెప్పారు. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తా.. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు సీఎం కేసీఆర్ (cm kcr) రాగలడా అని నిలదీశారు. సెక్యూరిటీ విషయంలో భయపెట్టాలని చూస్తే భయపడే రకం కాదన్నారు.
కొందరు అధికారుల పేర్లను కూడా రేవంత్ రెడ్డి (Revanth) ప్రస్తావించారు. ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులు ప్రభుత్వానికి తాబేదార్లుగా ఉన్నారని.. అలాంటి వారి పేర్లను రెడ్ బుక్లో రాస్తాం అని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాం అని వివరించారు. కోకాపేట, బుద్వేల్లో భూములు కొనుగోలు చేసిన సంస్థలు పేర్లు ఎందుకు చెప్పడం లేదని అడిగారు.