jaggareddy:కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి (jaggareddy). పార్టీలో ఎవరో ఒకరు నేతను ఇరుకున పెడుతుంటారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి (jaggareddy) చూపు అని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళతారా అనే చర్చ వచ్చింది. ఎందుకంటే సీఎం కేసీఆర్కు (kcr) జగ్గారెడ్డి లేఖ రాశారు.
jaggareddy:కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి (jaggareddy). పార్టీలో ఎవరో ఒకరు నేతను ఇరుకున పెడుతుంటారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) అనుకూలంగా ఉంటారు. తర్వాత తనకు పీసీసీ చీఫ్ పదవీ కావాలని అంటారు. పార్టీలో కంటిలో నలుసులా మారారని కొందరు అంటుంటారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి (jaggareddy) చూపు అని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళతారా అనే చర్చ వచ్చింది. ఎందుకంటే సీఎం కేసీఆర్కు (kcr) జగ్గారెడ్డి లేఖ రాశారు.
కేసీఆర్కు లేఖ (letter) రాయడంతో ఏ విషయం.. ఆయన్ను కలుస్తారా? పార్టీలో చేరతారా అనే ప్రశ్నలు వస్తాయి. కానీ ఆయన హోం గార్డుల (home guards) గురించి ఆ లేఖలో ప్రస్తావించారు. వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. రాష్ట్రంలో 16 వేల మంది హోం గార్డులు ఉన్నారని.. గతంలో వారికి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హోం గార్డులు విధులు నిర్వహించే చోట డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పామని సీఎం కేసీఆర్ (cm kcr) చెప్పిన మాటను గుర్తుచేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయం ప్రస్తావించారు.
హోం గార్డులను పర్మినెంట్ చేస్తే అన్ని బెనిఫిట్స్ వస్తాయని జగ్గారెడ్డి (jaggareddy) చెబుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నట్టు అవుతుందని అంటున్నారు. హోం గార్డులను పర్మినెంట్ చేసే విషయంలో జీవో తీసుకురావాలని జగ్గారెడ్డి (jaggareddy) లేఖలో కోరారు. జగ్గారెడ్డి హోం గార్డులు అంటే ఎందుకు ఇంత ప్రేమ.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు పట్టుకున్నారు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల గురించి అడిగితే తప్పేముందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మంచి చేసేందుకు ముందుకు వచ్చినా.. ఇలా అనుమానించడం ఏంటీ అని అడుగుతున్నారు. జగ్గారెడ్డి (jaggareddy) రాసిన లేఖ ఒకవిధంగా దుమారం రేపింది.
జగ్గారెడ్డి (jaggareddy)ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశం తక్కువ. ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు వెళతారని.. మరో పార్టీలో చేరరని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఏం జరుగుతుందో చూడాలీ మరీ.